Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్

14 Sep, 2021 19:42 IST|Sakshi

ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. పోస్టాఫీసు పథకాలు నమ్మదగినవి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. గరిష్ట వడ్డీ రేట్లతో ప్రజాదరణ పొందిన తపాలా కార్యాలయ పథకాలు కొన్ని సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం, కిసాన్ వికాస్ పాత్రా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (చదవండి: వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్)

సుకన్య సమృద్ధి పథకం 

  • సుకన్య సమృద్ధి పథకాన్ని సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట ప్రారంభించవచ్చు.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు.
  • సంవత్సరానికి 7.6 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన లెక్కిస్తారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం అనేది రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకొరకు ప్రజాదరణ పొందిన పథకం.
  • ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు
  • ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది.
  • మీరు రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
  • మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ను ఎవరైనా తెరవవచ్చు.
  • పిపిఎఫ్ కింద పెట్టుబడి పెట్టె నగదుపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
  • ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు.
  • పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది.
  • పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. 

కిసాన్ వికాస్ పత్ర 

  • కిసాన్ వికాస్ పాత్రా పథకం కింద కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు.
  • 124 నెలల్లో (10 సంవత్సరాలు 4 నెలలు) పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
  • వార్షికంగా 7.7 వడ్డీ వడ్డీ రేటు లభిస్తుంది
  • మీరు రూ.50,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత రూ.73,126 లభిస్తాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్

  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. 
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు.
  • వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మెచ్యూరిటీ కాలం తర్వాత మాత్రమే వడ్డీ అసలు చెల్లిస్తారు. 
  • ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి.
మరిన్ని వార్తలు