గంటకు 16 లక్షల కి.మీల వేగంతో దూసుకొస్తున్న సౌర తుపాను

12 Jul, 2021 12:36 IST|Sakshi

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి స‌బ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృత‌మైన‌ట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెద‌ర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో అందమైన ఖగోళ కాంతి దృశ్యాన్ని చూడనున్నారు. ఈ ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న ప్రజలు రాత్రి పూట అందమైన అరోరాను చూసే అవకాశం ఉంది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం సౌర తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఇంకా రాను రాను దాని వేగం మరింత పెరగనుంది. ఈ సౌర తుఫానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలగవచ్చని నాసా తెలిపింది. స్పేస్ వెద‌ర్ ప్రకారం, సౌర తుఫానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడి చెందే అవకాశం ఉంది. ఇది ఉష్ణోగ్రతలు ఉపగ్రహాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది జిపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే, విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఆటంకం కలుగుతుంది. ఈ సౌర తుపాను వల్ల ట్రాన్స్ ఫార్మర్ లు కూడా పేలే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీన భారీ సోలార్‌ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు