సంవత్సరానికి రూ.436 కడితే.. రూ.2 లక్షల బెన్ఫిట్‌

28 Oct, 2022 17:37 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని అందిస్తోంది. అతి తక్కువ ప్రీమియంతో ఈ స్కీమ్‌ లబ్ధి దారులు రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. 

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్‌లో చేరిన వారు సంవత్సరానికి రూ.436 చెల్లించి రూ.2 లక్షల వరకు జీవిత బీమా భద్రతను పొందవచ్చు.  ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల్ని కేంద్రం అందజేస్తుంది.   

పథకంలో ఎలా చేరాలి?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ స్కీమ్‌లో చేరేందుకు బ్రాంచ్‌ బ్యాంక్‌, పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న మొత్తం అకౌంట్‌ నుంచి ఆటో డెబిట్‌ అవుతుంది.  

అర్హతలు ఇవే
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.  18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి.  

రూ. 2 లక్షలు ఎలా వస్తాయి?
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.436 కట్టాలి. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు.

మరిన్ని వార్తలు