సన్యాసం తీసుకున్న ముఖేశ్‌ అంబానీ స్నేహితుడు

30 Apr, 2021 17:46 IST|Sakshi

ముంబై‌: రిలయన్స్‌ పరిశ్రమల అధినేత ముఖేశ్‌ అంబానీ వెన్నంటి ఉండే తన బాల్య మిత్రుడు.. కుడిభుజంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సన్యాసం స్వీకరించాడు. కోట్ల ఆదాయం వదులుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించారు. ఆయన సన్యాసం తీసుకుని చాలా రోజులైనా ఇప్పటికీ ఆ విషయం బహిర్గతమైంది. అయితే ఆయన ఎందుకు సన్యాసం స్వీకరించాడో.. ఎందుకు ఆ మార్గంలోకి వెళ్లారో చదవండి. ముఖేశ్‌ అంబానీకి ప్రకాశ్‌ షా (64) బాల్య మిత్రుడు. రిలయన్స్‌ పరిశ్రమల వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తుండేవాడు. ముఖేశ్‌ అంబానీకి కుడి భుజంలాంటివాడు. అతడి జీతం సంవత్సరానికి రూ.70 కోట్ల పైమాటే.

అలాంటి ప్రకాశ్‌ షా ఏప్రిల్‌ 25వ తేదీన జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్‌ మహారాజ్‌ సమక్షంలో మహావీరుడి జన్మ కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నూతన్‌ మునిరాజుగా మారిపోయారు. ఆయన భార్య నయనా బెన్‌ కూడా సన్యాసం స్వీకరించారు. వాస్తవంగా జైన మతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సహజమే. ఆయన స్వచ్ఛందంగా సన్యాసం పొందారు. అయితే ఆయన సన్యాసం స్వీకరించిన విషయం వ్యాపార వర్గాల్లో కానీ జాతీయ మీడియాలో కానీ ఎలాంటి వార్తలు కనిపించలేదు. ఈ సన్యాస దీక్షపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. ప్రకాశ్‌ షాకు కోట్ల జీతం రాదని.. ముఖేశ్‌ అంబానీకి కుడి భుజం కాదని ఆ సందేశంలో వివరించారు. 

ప్రకాశ్‌ షా కెమెకల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. ఐఐటీ బాంబేలో పీజీ చదివారు. రిలయన్స్‌ సంస్థల పనుల్లో ప్రకాశ​ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సన్యాస దీక్ష గతేడాదే స్వీకరించాల్సి ఉండగా కరోనా వలన ఆలస్యమైందని సమాచారం. ఆయన భార్య నయన్‌ కామర్స్‌లో పట్టభద్రురాలు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒక కుమారుడు కొన్నేళ్ల కిందట సన్యాసం స్వీకరించగా మరో కుమారుడు వివాహం చేసుకున్నాడు. భార్య, ఒకరు సంతానం.

చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి

చదవండి: సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి
 

మరిన్ని వార్తలు