నైట్‌వుడ్స్‌ బ్రోచర్‌ లాంచింగ్‌

7 Aug, 2021 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లగ్జరీ విల్లాల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్‌ గ్రూప్‌.. మరొక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం జూబ్లీ్లహిల్స్‌లోని ప్రణీత్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయంలో నైట్‌వుడ్స్‌ బ్రోచర్‌ లాంచింగ్‌ కార్యక్రమం జరిగింది. జీహెచ్‌ఎంసీ అనుమతి పొందిన గ్రూప్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ నైట్‌వుడ్స్‌. బీరంగూడలో 30 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 459 ప్రీమియం విల్లాలుంటాయని ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్రకుమార్‌ కామరాజు తెలిపారు. 150 నుంచి 213 గజాలలో, 1,800–2,441 చ.అ. బిల్టప్‌ ఏరియాలో విల్లా విస్తీర్ణాలు ఉంటాయి. ధర చ.అ.కు రూ.7,500. నైట్‌వుడ్స్‌ ప్రణీత్‌ గ్రూప్‌ నుంచి వస్తున్న 25వ ప్రాజెక్ట్‌. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కేవీఎస్‌ నర్సింగరావు, పీ రామాంజనేయ రాజు, చంద్రశేఖర్‌ రెడ్డి బక్కిరెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్‌ రెడ్డి సప్పిడి, సందీప్‌రావ్‌ మాధవరంలు పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు