1,100 ఎకరాలు 19 ప్రాజెక్ట్‌లు 

31 Jul, 2021 00:58 IST|Sakshi

నిర్మాణంలో నాణ్యత, గడువులోగా కొనుగోలుదారులకు అప్పగింత.. ఇవే వ్యాపార లక్ష్యంగా చేసుకొని నివాస సముదాయాలను నిర్మిస్తోన్న ప్రణీత్‌ గ్రూప్‌... నగరం నలువైపులా విస్తరణకు ప్రణాళికలు చేపట్టింది. గతంలో బాచుపల్లి, బీరంగూడ వంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్థ... అన్ని ప్రధాన ప్రాంతాలలో ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. కొల్లూరు, దుండిగల్, పటాన్‌చెరు, అన్నోజిగూడ, బీఎన్‌ రెడ్డి నగర్, ఖాజాగూడ, మియాపూర్‌ వంటి ప్రాంతాలలో సుమారు 1,100 ఎకరాలలో 19 ప్రాజెక్ట్‌లను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్రకుమార్‌ కామరాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. 

సాక్షి, హైదరాబాద్‌:  ఇటీవలే 14 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రణీత్‌ గ్రూప్‌.. ఇప్పటివరకు 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 22 ప్రాజెక్ట్‌లలో సుమారు 5 వేల గృహాలను నిర్మించింది. ప్రస్తుతం 75 లక్షల చ.అ.లలో 8 ప్రాజెక్ట్‌లు, సుమారు 3,500 యూనిట్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో 1,600 గృహాలను డెలివరీ చేయడంతో పాటు సుమారు 5 వేల ఫ్లాట్లను ప్రారంభించనున్నాం. 

మల్లంపేటలో 30 ఎకరాలలో లీఫ్‌ ప్రాజెక్ట్‌ను నిర్మి స్తు న్నాం. 10 లక్షల చ.అ.లలో ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 502 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. విల్లాల డెలివరీ మొదలైంది. ఈ డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. 

బాచుపల్లిలో 6 ఎకరాలలో టౌన్‌స్క్వేర్‌ అపార్ట్‌మెం ట్‌. 7 లక్షల చ.అ.లలో మొత్తం 527 యూనిట్లుం టాయి. 2.5, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.5 వేలు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి అప్పగింత మొదలవుతుంది. 

బహుదూర్‌పల్లిలో 4.5 ఎకరాలలో ఫ్లోరా ప్రాజెక్ట్‌. 5 లక్షల చ.అ.లలో రెసిడెన్షియల్, కమర్షియల్‌ రెండు రకాల నిర్మాణాలుంటాయి. 2, 2.5, 3 బీహెచ్‌కే మొత్తం 392 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,200. ఇందులో 31 వేల చ.అ.లలో కమర్షియల్‌ స్పేస్‌ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి డెలివరీ మొదలవుతుంది. 

కొల్లూరులో 2.5 ఎకరాలలో ఎలైట్‌ ప్రాజెక్ట్‌. 2.65 లక్షల చ.అ.లలో మొత్తం 144 యూనిట్లుంటాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.4,800. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి డెలివరీ మొదలవుతుంది. 

బీరంగూడలో 30 ఎకరాలలో నైట్‌వుడ్స్‌ విల్లా ప్రాజెక్ట్‌. 150–250 గజాల మధ్య మొత్తం 460 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ. 7 వేలు. 2023 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. 

3 నెలల్లో ప్రారంభం..
హైదర్‌నగర్‌లో 5 ఎకరాలలో జైత్ర పేరిట జీ+14 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 12.2 లక్షల చ.అ.లో మొత్తం 576 యూనిట్లుంటాయి. 2024 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. ధర చ.అ. రూ.6,500. బాచుపల్లిలో 5 ఎకరాలలో సాలిటైర్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 12 లక్షల చ.అ.లలో మొత్తం 668 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. బెంగళూరులో తొలి ప్రాజెక్ట్‌.. 

మల్లంపేట దగ్గర్లోని శంభీపూర్‌లో 4 ఎకరాలలో డఫోడిల్స్‌ ప్రాజెక్ట్‌. 4 లక్షల చ.అ.లలో మొత్తం 300 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,500. 

ఘట్‌కేసర్‌ దగ్గర్లోని అన్నోజిగూడలో 6.5 ఎకరాలలో, 12 లక్షల చ.అ.లలో హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌ రానుంది. ఇందులో 700 యూనిట్లుంటాయి. చ.అ.కు రూ.4,500. 

కొల్లూరు దగ్గర్లోని వెలిమల ప్రాంతంలో 11 ఎకరాలలో నవనీత్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. మొత్తం 20 లక్షల చ.అ.లు కాగా.. ఫేజ్‌–1 కింద 12 లక్షల చ.అ.లలో 650 యూనిట్లను నిర్మించనున్నాం. ఫేజ్‌–2లో 8 లక్షల చ.అ.లను అభివృద్ధి చేస్తాం. ధర చ.అ.కు రూ.5 వేలు.

వచ్చే ఏడాది బెంగళూరులో తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. సజ్జాపూర్‌ రోడ్‌లో 17 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్, ఐటీ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నాం. 

గ్రోవ్‌ పార్క్‌లో బోటింగ్‌
హైదరాబాద్‌లో తొలిసారిగా బోటింగ్‌ సౌకర్యంతో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. లగ్జరీ వసతులు, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ కొనుగోలుదారులకు సరికొత్త అనుభూతులను అందించే లా డిజైన్స్‌లను ఎంపిక చేస్తున్నాం. దుండిగల్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నుంచి 1.5 కి.మీ దూరంలో గాగిళ్లపూర్‌లో గ్రోవ్‌పార్క్‌ పేరిట ఇంటిగ్రేటెడ్‌ గ్రూప్‌ హౌసింగ్‌ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. వెంచర్‌ మధ్యలో సరస్సు కొలువై ఉండటం దీని ప్రత్యేకత. మొత్తం 78 ఎకరాల ప్రాజెక్ట్‌ కాగా.. ఇందులో 62 ఎకరాలలో మాత్రమే విల్లాలుంటాయి. 7 ఎకరాలలో లేక్‌ పోగా.. 9 ఎకరాల స్థలాన్ని ల్యాండ్‌ స్కేపింగ్, ఇతరత్రా వసతులకు కేటాయించాం. లేక్‌ చుట్టూ గ్రీనరీ, బోటింగ్, ఇతరత్రా సౌకర్యాలతో పూర్తి గా పర్యావరణ హితమైన ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతాం. 

ప్రాజెక్ట్‌లో మొత్తం 1,000 లగ్జరీ విల్లాలుంటాయి. 150 గజాలు, 400 గజాలలో ట్రిపులెక్స్‌ విల్లాలు... ఒక్కోటి 2 వేల చ.అ. నుంచి 5 వేల చ.అ. మధ్య విస్తీర్ణాలలో ఉంటుంది. ధర చ.అ.కు రూ.6,500. నిర్మాణ అనుమతులు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. మూడేళ్లలో పూర్తి చేస్తాం. 

ఇందులో 70 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్, ఓపెన్‌ థియేటర్, ఫ్రాగ్రెన్స్‌ గార్డెన్, బటర్‌ఫ్లై గార్డెన్, ఓర్చిడ్‌ గార్డెన్, పెట్స్‌ పార్క్, పార్టీ లాన్స్‌ వంటివి అభివృద్ధి చేస్తాం. వీటితో పాటు టెన్నిస్, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్, క్రికెట్‌ పిచ్, బాస్కెట్‌ బాల్, వాలీబాల్‌ కోర్ట్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్కేటింగ్‌ రింక్, ఔట్‌డోర్‌ జిమ్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. 

మరిన్ని వార్తలు