‘బకరాల్ని చేశాడు.. మస్క్‌ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్‌’

29 Oct, 2022 18:38 IST|Sakshi

ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం.. ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, పాలసీ చీఫ్‌ విజయ గద్దె, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగాల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌లను తొలగించారు. అయితే ఉద్యోగుల తొలగింపు అంశం మరో సారి చర‍్చాంశనీయంగా మారింది. 

మస్క్‌ - ట్విటర్‌ కొనుగోలు కొలిక్కి రావడం. టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్‌ తొలగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తాజాగా, శాన్‌ఫ్రాన‍్సిస్కోలో ఉన్న ట్విటర్‌ ప్రధాన కార్యాలయం నుంచి భారతీయుడు రాహుల్‌ లిగ్మా, డానియల్‌ జాన్సన్‌లు అమాయక చక్రవర్తుల్లాంటి మొహాలతో అట్టపెట్టెలు తీసుకొని బయటకు వచ‍్చారు. దీంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఏమైందని వారిని ప్రశ్నించగా..మస్క్‌ తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు. 

చదవండి👉 భారత్‌పై ఎలాన్‌ మస్క్‌ స్వీట్‌ రివెంజ్‌!

దీంతో వాళ్లు చెప్పింది నిజమని నమ్మిన దిగ్గజ మీడియా సంస్థలు సైతం వీడియోల్ని ప్రసారం చేశాయి. ప్రింట్‌ మీడియా సైతం పతాక శీర్షికలతో కథనాల్ని వడ్డి వార్చాయి. ఉద్యోగుల తొలగింపుపై నెటిజన్లు మస్క్‌కు శాపనార్ధాలు పెట్టారు.

ఈ తరుణంలో మీడియా కథనాల్ని మస్క్‌ ట్వీట్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు నిజమైన ట్విటర్‌ ఉద్యోగులు కాదని, ఫ్రాంక్‌ స్టార్లని తేలింది. మస్క్ సైతం ఆ కథనాల్ని ట్వీట్‌ చేస్తూ ఫ్రాంక్‌ స్టార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలపై ట్విటర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ పాల్‌ లీ స్పందించారు. మస్క్‌ ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న వార్తల్ని ఖండించారు. వాస్తవాల్ని తెలుసుకొని ప్రసారం చేయాలని కోరారు.

చదవండి👉 ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్‌, ‘వారానికి 4 రోజులే ప‌ని’

మరిన్ని వార్తలు