మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే!

7 Oct, 2021 20:15 IST|Sakshi

బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్ గత కొంత కాలంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే చాలా సార్లు రోడ్లపై పరీక్షల సమయంలో కనిపించింది. ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కారు, లేటెస్ట్ ఫీచర్స్ తో రానున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుని కంపెనీ పూర్తిగా దేశీయ ఉత్పత్తులతో తయారు చేస్తుంది. ఇది అధునాతన లక్షణాలు కలిగిన స్వదేశీ లగ్జరీ కారు కానుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం తన మొదటి ఎలక్ట్రిక్ కారుని 2022లో విడుదల చేయనుంది. 

అంతే గాకుండా కంపెనీ 2022లో సుమారు 2,500 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2023 నాటికి ఒక లక్ష కార్లను మరియు 2025 నాటికి 1 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి సన్నాహాలు చేస్తుంది. దీని ఫీచర్స్ కూడా వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ కారు ప్రధాన ప్రత్యేకత అందరినీ ఆకట్టుకునే డిజైన్.(చదవండి: ఈ-కామర్స్ అమ్మకాలలో కుమ్మేస్తున్న టైర్ 3 నగరాలు)

ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్

  • దీని గరిష్ట వేగం 196 కిమీ/గం. 
  • ఇది 201.5 బిహెచ్‌పి పవర్, 2400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
  • ప్రవైగ్ 5.4 సేకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 
  • దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 504 కిలో మీటర్లు దూసుకెళ్తుంది.
  • ఇది 150 KW పవర్ అవుట్ పుట్ గల మోటార్ కలిగి ఉంది.
  • ఫాస్ట్ చార్జర్ దీనిని చార్జ్ చేస్తే 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. 

ప్రవైగ్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ కార్ అధునాతన ఫీచర్స్ గల అటానమస్ టెక్నాలజీ కోసం NVIDIAతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. అంతే కాకుండా ఈసీయు, ఇతర కంట్రోల్ మెటీరియల్స్ అన్నీ కూడా కంపెనీ తయారు చేసుకుంటుంది. ప్రీమియం సౌండ్ సిస్టమ్ డెవియాలెట్ నుంచి తీసుకొనున్నారు. ఈ కారు ప్రీమియంగా ఉండనుంది.

మరిన్ని వార్తలు