కోట్లు ఖరీదు చేసే అపార్ట్‌మెంట్‌ కొన్న ప్రీతి జింటా!

26 Oct, 2023 15:14 IST|Sakshi

ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్‌ఫామ్ ఇండెక్స్‌టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ  అపార్ట్‌మెంట్‌ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం.

ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ
ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు.

ముంబై రియల్ ఎస్టేట్
ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, అతని భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!

సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు