దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్‌ ప్రారంభం

23 Oct, 2021 06:36 IST|Sakshi

రూ.99 వేల ఫర్నిచర్‌ కొనుగోలుపై యాక్టివా లేదా జూపిటర్‌ బైక్‌ ఉచితం

రూ.59 వేల ఫర్నిచర్‌పై హీరో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం ఫ్రీ

రూ.49 వేల బాంటియా ఉత్పత్తులపై గోల్డ్‌ బ్రేస్‌లెట్‌ లేదా 42 అంగుళాల టీవీ

రూ.29,999 ఫర్నిచర్‌ మీద బంగారం, వజ్రాల లాకెట్‌

సాక్షి, హైదరాబాద్‌: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్‌ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్‌’ పేరిట ఫర్నిచర్‌ కార్నివాల్‌ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్‌ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్‌ సేల్‌ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్‌లైన్‌ (బాంటియా.ఇన్‌)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్‌ టేబుల్, వార్డ్‌రోబ్, బుక్‌షెల్ఫ్, బెడ్‌రూమ్‌ సెట్స్, ఆఫీస్‌ కురీ్చలు, టేబుల్స్‌ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.

ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు..
నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్‌ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్‌ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది.

ఎక్స్‌ఛేంజ్‌పై 20–30 శాతం రాయితీ..
బాంటియాలో ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్‌ టేబుల్స్‌ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్‌డోర్‌ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి.

విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగాం
బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. పండుగ షాపింగ్‌లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్‌ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
– సురేందర్‌ బాంటియా, ఎండీ, బాంటియా

బుక్‌ చేసిన రోజే ఇంటికి డెలివరీ
నాణ్యమైన ఫర్నిచర్‌కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ను బుక్‌ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్‌ షాపింగ్‌ సీజన్‌ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను కూడా అందిస్తాం.  
– అమిత్‌ బాంటియా, డైరెక్టర్, బాంటియా

మరిన్ని వార్తలు