LPG Cylinder Prices: వినియోగదారులకు ఊరట, తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర 

1 Sep, 2022 08:53 IST|Sakshi

న్యూడిల్లీ: వంట గ్యాస్​ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో రూ.91.50 తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 1, 2022) నుంచి  ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్‌ సిలిండర్ల  ధరలో ఎలాంటి మార్పు లేదు. (Zomato: నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్‌ ఆఫర్‌)

తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్‌ షాక్‌: కాంపా కోలా రీఎంట్రీ)

మరిన్ని వార్తలు