రియల్టీలో పీఈ పెట్టుబడుల భారీ క్షీణత

24 Sep, 2020 06:45 IST|Sakshi

జనవరి–ఆగస్టు మధ్య 85 శాతం పతనం

42,500 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు డౌన్‌

కోలియర్స్, ఫిక్కీ నివేదిక

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌లో  2020 జనవరి–ఆగస్టు మధ్య ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీగా పడిపోయాయి. 2019 ఇదే కాలంతో పోల్చిచూస్తే ఈ విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్‌ 85 శాతం పడిపోయి 866 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు)గా నమోదయ్యింది. 2019 ఇదే కాలంలో ఈ పెట్టుబడుల విలువ 5,795 మిలియన్‌ డాలర్లు. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలు మరింత దెబ్బతీశాయి.  కోలియర్స్‌ ఇంటర్నేషనల్, ఫిక్కీ నివేదిక ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ‘భవిష్యత్‌ భారత్‌: ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు, వ్యూహాత్మక చర్యలు’ అన్న పేరుతో రూపొందిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే...

► మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతాన్ని డేటా సెంటర్స్‌ విభాగం ఆకర్షించింది.
► ఆఫీస్‌ సెగ్మెంట్‌ విషయంలో ఇది 24 శాతంగా ఉంది. విలువలో దాదాపు రూ.1,500 కోట్లు.
► ఇండస్ట్రియల్‌ విభాగం వాటా 12 శాతం.
► ఆతిధ్య రంగం వాటా 9 శాతం.
► హౌసింగ్, రెంటల్‌ హౌసింగ్‌  విభాగానిది 8 శాతం అయితే, కో–లివింగ్‌ వాటా ఒకశాతం.  
► కోవిడ్‌–19 నేపథ్యంలో ఇటు దేశీయ, అటు విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ రియల్టీలో పెట్టుబడుల పట్ల అత్యంత జాగరూకతను ప్రదర్శిస్తున్నారు.  
► పారిశ్రామిక, రవాణా విభాగాలకు సంబంధించి రియల్టీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న వినియోగ డిమాండ్‌ ఆయా విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.  
► క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారిస్తే, ప్రతిఫలాలు ఉంటాయి.  
► చౌక ధరలు, ఒక మోస్తరు ఖర్చుతో నిర్మిస్తున్న నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
► ఆతిధ్య రంగం, రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లో అవకాశాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.
► రియల్టీలో మందగమనం ఉన్నప్పటికీ, మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా