సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: వరుసగా నాలుగో రోజు నష్టాలు

14 Mar, 2023 17:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు కూడా పతనమైనాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభం, అంతర్జాతీయమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆ తరువాత నష్టాలనుంచి కోలుకున్నప్పటికీ చివరల్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 337.66 పాయింట్లు లేదా 0.58 శాతం క్షీణించి 57,900 వద్ద,  నిఫ్టీ 111 పతనంతో 17,043 వద్ద ముగిసాయి. 

ఒక దశలో నిఫ్టీ 17వేల కిందికి పడిపోయింది.  అయితే డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టం వద్ద నమోదు కావడం ఊరట నిచ్చింది. మీడియా, ఫార్మా మినహా  ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్,  అదానీ పోర్ట్‌లు వరుసగా 8, 4శాతం నష్టపోయాయి. 

టైటన్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్  టాప్‌ విన్నర్స్‌గా, ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్ స్టాక్స్  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు