అందుబాటు ధరల ఇళ్లు.. రూ.45లక్షల కోట్లు

23 Nov, 2021 08:34 IST|Sakshi

భారీ పెట్టుబడుల అవకాశాలు 

పట్టణ ప్రాంతాల్లో  3.5 కోట్ల ఇళ్ల అభివృద్ధి  

న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల మార్కెట్‌ రూ.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కనీస ప్రమాణాలకు దిగువన ఉంటున్న వారి కోసం 3.5 కోట్ల నాణ్యమైన ఇళ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది. 2021 నాటికి 790 కోట్ల ప్రపంచ జనాభాలో 57 శాతం మంది (450 కోట్లు) పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ప్రస్తావించింది.

దులో 29 శాతం పట్టణ జనాభా కనీస ప్రమాణాలకు నోచుకోని ఇళ్లలో ఉంటున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. దీంతో పట్టణాల్లో 32.5 కోట్ల ఇళ్ల అవసరం ఉందని తెలిపింది. భారత్‌లో 35 శాతం మేర పట్టణ జనాభాకు (3.5 కోట్లు) ఇళ్ల అవసరం ఉందని పేర్కొంది. 3.5 కోట్ల ఇళ్లలో 2 కోట్ల వరకు ఆర్థికంగా బలహీన వర్గాల కోసం అవసరమవుతాయని.. 1.4 కోట్ల ఇళ్లు తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం, 10 లక్షల ఇళ్లు దిగువ మధ్యతరగతి వారి కోసం అవసరమని అంచనా వేసింది. 3.5 కోట్ల ఇళ్ల నిర్మాణానికి 1,658 కోట్ల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం మొత్తం రూ.34.56 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని, భూమి, ఇతర ఆమోదాలకు మరో రూ.10.36 లక్షల కోట్లు కావాల్సి వస్తుం§దని నైట్‌ఫ్రాంక్‌ తన నివేదికలో వివరించింది.
 

మరిన్ని వార్తలు