రియల్‌ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్‌.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు

4 Apr, 2023 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్‌ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది.

(రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు)

కార్యాలయాల స్థూల లీజింగ్‌ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో ఆఫీస్‌ లీజింగ్‌ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్‌కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి.

(అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..)

బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్‌ మార్కెట్‌ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్‌ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్‌ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది.

(అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు)

మరిన్ని వార్తలు