80 మిలియన్‌ డాలర్లకు ప్రోజస్‌ నష్టాలు

24 Nov, 2022 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి­క సంవత్సరం ప్రథమార్ధంలో టెక్నాలజీ ఇన్వెస్టర్‌ ప్రోజస్‌ 80 మిలియన్‌ డాలర్ల ట్రేడింగ్‌ నష్టం ప్రకటించింది. ప్రధానంగా పేయూ ఇండియా వ్యాపారంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాల్సి రావడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో పేయూ ఆదాయం 183 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. నెదర్లాండ్స్‌కి చెందిన ప్రోజస్‌ గ్రూప్‌ భారత్‌లో ఓఎల్‌ఎక్స్, బైజూస్, మీషో, ఎలాస్టిక్‌రన్, డేహాత్, ఫార్మ్‌ఈజీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసింది.   

మరిన్ని వార్తలు