ప్రభుత్వ బ్యాంకుల జోష్‌- మార్కెట్లు వీక్‌

29 Jul, 2020 12:35 IST|Sakshi

సెన్సెక్స్‌ 156 పాయింట్లు డౌన్‌

28 పాయింట్లు క్షీణించి 11,273కు చేరిన నిఫ్టీ

పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3 శాతం అప్‌

బ్యాంకర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష, విదేశీ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 156 పాయింట్లు క్షీణించి 38,337ను తాకగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,273 వద్ద ట్రేడవుతోంది. ముందురోజు భారీగా ఎగసిన మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. నేడు ప్రధాన బ్యాంకర్లతో ప్రధాని మోడీ సమావేశంకానున్నారు. దీంతో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3 శాతం ఎగసింది. 

ఫార్మా, మెటల్‌ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ఇతర రంగాలలో ఫార్మా, మెటల్‌, రియల్టీ, మీడియా 2-1 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 1 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో యుకో, సెంట్రల్‌, జేఅండ్‌కే, మహారాష్ట్ర బ్యాంక్‌ 7-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, యూనియన్‌, ఇండియన్‌ బ్యాంకులతోపాటు బీవోబీ, ఎస్‌బీఐ, ఐవోబీ, కెనరా బ్యాంక్‌ 4-2 శాతం మధ్య ఎగశాయి.

బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, టాటా స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, గెయిల్‌ 5-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హీరో మోటో 2.5-0.6 శాతం మధ్య నష్టపోయాయి.

మరిన్ని వార్తలు