పబ్‌జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది

18 Nov, 2020 13:37 IST|Sakshi

న్యూఢిల్లీ: పబ్‌జీ ప్రియులకు శుభవార్త. పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" రాబోతున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పబ్‌జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియాలో భారత మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ గేమ్‌ను డిజైన్ చేస్తోంది కంపెనీ. అంతే కాకుండా... భారత గేమింగ్ పరిశ్రమలో సుమారు రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా యూట్యూబ్‌లో టీజర్ రిలీజ్ చేసింది పబ్‌జీ కార్పొరేషన్. పబ్‌జీ మొబైల్ ఇండియా టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్‌కే 39 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే పబ్‌జీ గేమ్‌కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  

భారతదేశం వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించడంతో పాటు దేశం వెలుపల ఉన్న సర్వర్లకు చేరవస్తున్నాయనే కారణంతో చైనాకు చెందిన పబ్‌జీ, 117 ఇతర చైనా యాప్స్ ను భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేధించింది. ఈసారి భారతదేశంలోని ఆటగాళ్ల గోప్యత, భద్రతను కాపాడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది పబ్‌జీ కార్పొరేషన్. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలోనే సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి పబ్‌జీ కార్పొరేషన్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. అయితే మొబైల్ వర్షన్ గేమ్‌ బాధ్యతల్ని గతంలో చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌కు అప్పగించింది. ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత పబ్‌జీ మొబైల్ బాధ్యతల నుంచి టెన్సెంట్ గేమ్స్ తప్పుకొంది. (పబ్‌జీ: ఫోన్‌ ఇవ్వలేదన్న కోపంతో..)

మరిన్ని వార్తలు