పబ్జీ గేమ్ ఇండియా కంపెనీ మరింత స్ట్రాంగ్‌

23 Dec, 2020 13:29 IST|Sakshi

క్రాఫ్టన్‌ ఇంక్‌ బోర్డులో కొత్తగా ఐదుగురు సభ్యులు

గతంలో టెన్సెంట్‌లో విధులు నిర్వర్తించిన వారికి చాన్స్‌

న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా లక్షల మంది గేమర్స్‌ను ఆకట్టుకున్న పబ్జీ(పీయూబీజీ) ఇండియా మాతృ సంస్థ క్రాఫ్టన్‌ ఇంక్ తాజాగా బోర్డును పటిష్టం చేసుకుంది. పబ్జీ ప్రేమికులకు ఆసక్తిని రేకెత్తిస్తూ బోర్డులో కొత్తగా ఐదుగురు సభ్యులకు చోటిచ్చింది. వీరంతా టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్‌లో విధులు నిర్వహించినవారే కావడం గమనించదగ్గ అంశం. ప్రధానంగా గేమింగ్‌ పరిశ్రమలో 15ఏళ్ల అనుభవమున్న అనీష్ అరవింద్‌ను కంట్రీ మేనేజర్‌‌గా ఎంపిక చేసుకుంది. ఇంతక్రితం గేమింగ్‌ దిగ్గజాలు టెన్సెంట్‌, జింగా తదితర కంపెనీలకు అనీష్ సేవలు అందించారు. పబ్జీ మొబైల్‌ గ్లోబల్‌ వెర్షన్‌ హక్కులుగల టెన్సెంట్‌ నుంచి మరో నలుగురిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేసుకుంది. వీరిలో ఆకాష్‌ జుండే(విజువల్‌ కంటెంట్ డిజైనర్), పీయూష్‌ అగర్వాల్‌(ఫైనాన్స్‌ మేనేజర్‌), అర్పిత ప్రియదర్శిని(సీనియర్‌ కమ్యూనిటీ మేనేజర్‌), కరణ్ పథక్‌(సీనియర్‌ ఈస్పోర్ట్స్‌ మేనేజర్‌) ఉన్నారు.

మరిన్ని వార్తలు