పబ్‌జీ టోర్నీలో గెలిస్తే రూ. 6 కోట్లు!

24 Nov, 2020 16:15 IST|Sakshi

దేశ భద్రతా కారణాల దృష్ట్యా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ గేమ్‌ని భారత్‌లో నిషేధించిన తరువాత తిరిగి "పబ్ జీ మొబైల్ ఇండియా" పేరుతో భారత మార్కెట్లోకి రావడానికి భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో "పబ్‌జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న ఈ గేమ్‌ కోసం దేశంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైనాకు చెందిన ఈ పబ్‌జీ గేమ్ ఇండియన్ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇచ్చింది. దీంతో పబ్‌జీ తిరిగి భారత్‌లో తన కార్యకలాపాల్ని కొనసాగించనుంది. పబ్‌జీ మొబైల్ గేమ్‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్‌జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. (చదవండి: ఈ యాప్ తో వేలల్లో సంపాదించండి)

తాజాగా భారత పబ్‌జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ట్విటర్‌లో ఒక ప్రకటన చేసారు. పబ్‌జీ నిర్వహించబోయే టోర్నీలో గెలిచే ప్లేయర్లకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందించనున్నారని తెలిపారు. ఇక పబ్జీ గేమ్‌ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్‌ను డెవలప్ చేస్తున్న టైర్–1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ గేమ్‌కి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పబ్‌జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన 'పబ్‌జీ మొబైల్ ఇండియా'లో భారత మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ గేమ్‌ను డిజైన్ చేస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా