Punjab National Bank: లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్

17 Sep, 2021 18:13 IST|Sakshi

మీరు కొత్తగా హోమ్ లోన్, వ్యక్తి గత రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. బ్యాంకులు కొద్ది రోజుల నుంచి వడ్డీ రేట్లు తగ్గయిస్తున్నాయి. ఈ విషయంలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందువరుసలో ఉన్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో అనుసంధానిత రుణ రేటును(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 6.80 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గిస్తున్న ఆర్‌ఎల్‌ఎల్‌ రేటు అనేది నేటి(17-09-2021) నుంచి అమలులోకి రానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకొనేటప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్న రుణగ్రహితలకు దీని వల్ల లాభం చేకూరుతుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రేటు తగ్గడం వల్ల అంత మేర మీరు ప్రతి నెల వడ్డీ తగ్గుతుంది. ఈ బ్యాంకుతో పాటు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్‌‌ శుభవార్త!)

మరిన్ని వార్తలు