ఎఫ్‌డీ వడ్డీ రేట్లు సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్

2 Aug, 2021 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ తన ఖాతాదారులు జమ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు పెట్టుబడి పెట్టె ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై 0.5 శాతం అద‌న‌పు వ‌డ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై బ్యాంక్ 2.9% - 5.25% మ‌ధ్య వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఈ వ‌డ్డీ రేట్లు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల కంటే తక్కువ):

డిపాజిట్ కాల వ్యవది వడ్డీ రేటు
7 నుంచి 14 రోజులు  2.9%
15 నుంచి 29 రోజులు  2.9%
30 నుంచి 45 రోజులు  2.9%
46 నుంచి 90 రోజులు   3.25%
91 నుండి 179 రోజులు  3.80%
180 రోజుల నుంచి 270 రోజులు  4.4%
271 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ  4.4%
1 సంవత్సరం  5%
1 సంవత్సరం కంటే పైన & 2 సంవత్సరాల వరకు  5%
2 సంవత్సరాల కంటే పైన & 3 సంవత్సరాల వరకు  5.10%
3 సంవత్సరాలు పైన & 5 సంవత్సరాల వరకు  5.25%
5 సంవత్సరాల కంటే పైన & 10 సంవత్సరాల వరకు  5.25%

మరిన్ని వార్తలు