మొండిఘటం: పుతిన్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఇదే..ఆ దేశాలకు రివర్స్‌ ఝులక్‌!

1 Apr, 2022 19:54 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యురప్‌ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఓ వైపు యుద్ధంతో ఉక్రెయిన్‌తో పాటు శత్రు దేశాల్ని వణికిస్తూనే.. నెక్ట్స్‌ టార్గెట్‌గా ఆయా దేశాల అవసరాల‍్ని ఆసరాగా చేసుకొని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1నుంచి గ్యాస్‌ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్‌లోనే చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేని పక్షంలో శత్రు దేశాలుగా భావిస్తామని హెచ్చరించారు. 

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. వారాల తరబడి యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యూహాలు రచయిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను టార్గెట్‌గా ఐరోపాలో పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అదే సమయంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో- యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రష్యా రూబెల్స్‌ విలువ ఘోరంగా పతనమైంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆర్ధిక  ఆంక్షలు విధిస్తున్న దేశాలకు భారీ ఝలక్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌. తమ నుంచి గ్యాస్‌ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్‌లోనే చెల్లింపులు చేయాలని షరతు విధించారని రష్యన్‌ మీడియా సంస్థ 'రియా నోవోష్ఠి' కథనాన్ని ప్రచురించింది.  

వీళ్లంతా మా శ‌త్రువులే
ఇప్పటికే తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్ని పుతిన్‌ తమ శత్రు దేశాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రష్యా 48 దేశాలతో ఓ జాబితాను విడుదల చేశారు. అమెరికా నార్వే, జపాన్‌, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు అన్నీ యూరప్‌ దేశాలను ఈలిస్ట్‌లో చేర‍్చారు పుతిన్‌. ఈ దేశాలేవీ తమకు మిత్రపక్షాలు కావని స్పష్టం చేశారు. ఇప్పుడీ దేశాలు రష్యా రూబెల్స్‌లోనే రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు