‘వ్యాక్సిన్‌ ఆఫర్‌’.. ఒక సినిమా టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ !

30 Jul, 2021 12:02 IST|Sakshi

దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్‌ చైన్‌ పీవీఆర్‌ సినిమాస్‌ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్‌కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్‌ ఆఫర్‌’ను ప్రకటించింది.

బొమ్మపడింది
దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్‌ అవుతున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ​ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్‌ చేశామని పీవీఆర్‌ ప్రకటించింది.

అందరికీ వ్యాక్సిన్‌
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్‌ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్‌ వ్యాక్సిన్‌ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్‌ చేయవచ్చని చెప్పండి

వ్యాక్సిన్‌ ఆఫర్‌
మల్టీప్లెక్సుల ఓపెనింగ్‌ సందర్భంగా వ్యాక్సిన్‌ ఆఫర్‌ని ప్రకటిచింది పీవీఆర్‌ సినిమాస్‌. వ్యాక్సిన్‌ తీసుకుని పీవీఆర్‌ సినిమాస్‌కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్‌ (సినిమా)పై ఒక టికెట్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ సెక‌్షన్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌ మల్టీప్లెక్సులు ఓపెన్‌ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్‌ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్‌ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. 
 

మరిన్ని వార్తలు