పీవీఆర్, ఐనాక్స్‌ విలీనానికి ఓకే

22 Jun, 2022 06:07 IST|Sakshi

స్టాక్‌ ఎక్సే్ఛంజీల గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ దిగ్గజాలు పీవీఆర్‌ లిమిటెడ్, ఐనాక్స్‌ లీజర్‌ మధ్య విలీనానికి స్టాక్‌ ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్‌ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్‌ లీజర్‌ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్‌ లీజర్‌ విలీనానికి తొలుత స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు.

ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్‌ లీజర్‌ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు