పీవీఆర్‌ నష్టాలు తగ్గాయ్‌

18 Oct, 2022 10:27 IST|Sakshi

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ దిగ్గజం పీవీఆర్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ బిజినెస్‌ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్‌ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

మరిన్ని వార్తలు