జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు

29 Jul, 2020 14:22 IST|Sakshi

1.5 బిలియన్ డాలర్లు పెట్ట్టుబడులు

ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ)

సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియోలో వరుస పెట్టుబడులను సాధించిన రిలయన్స్‌ తాజాగా జియో ఫైబర్‌లో పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా  దోహా ఆధారిత ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ) జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తో  చర్చలు జరుపుతోంది. (రిలయన్స్‌ రికార్డుల దూకుడు)

జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని  పిలిచే మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (ఇన్విట్)లో 1.5 బిలియన్ డాలర్ల (11200 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ రడీ అవుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కోసం సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్,  మోయిల్స్ అండ్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ నేతృత్వంలోని కన్సార్షియం, రిలయన్స్‌లో  25, 215 కోట్ల రూపాయల పెట్టబడులు పెట్టింది.  2019లో రిలయన్స్ జియో ఇన్ ఫో కామ్ నుంచి ఫైబర్ బిజినెస్ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌ డీమెర్జ్ అయిన సంగతి తెలిసిందే.   ప్రస్తుత 7లక్షల కిలోమీటర్ల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా11లక్షల కిలోమీటర్ల పరిధికి విస్తరించాలని ఉన్న జియో డిజిటల్ ఫైబర్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా