క్వాల్‌కామ్ నుంచి మరో ప్రాసెసర్.. డౌన్‌లోడ్‌ స్పీడ్ 600 ఎమ్‌బిపిఎస్

16 Dec, 2020 15:35 IST|Sakshi

క్వాల్‌కామ్ ఈ నెల మొదటి వారంలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రాసెసర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ లో భాగంగా 675 ప్రాసెసర్ కి కొనసాగింపుగా 678 ప్రాసెసర్ ని తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ 11నానోమీటర్ టెక్నాలజీపై తయారు చేయబడింది. దీని యొక్క డౌన్లోడ్ స్పీడ్ 600ఎంబిపిఎస్ కాగా, అప్లోడ్ స్పీడ్ 150 ఎంబిపిఎస్ గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్ లో ఎక్స్ 12 ఎల్టీఈ మోడమ్ ని అందించారు. ఇది 4కే రికార్డింగ్ వీడియోకి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్ సి కూడా సపోర్ట్ చేస్తుంది. 675 ప్రాసెసర్ ని 2018లో తీసుకొచ్చారు. క్వాల్‌కామ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం ఈ ప్రాసెసర్ ని తీసుకొచ్చింది.(చదవండి: ఈ 25వేలు మీ సొంతం

స్నాప్‌డ్రాగన్ 678 ఫీచర్స్: 

క్వాల్‌కామ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా కొత్త చిప్ ని ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 675ప్రాసెసర్ తీసుకొచ్చిన రెండేళ్ల తర్వాత దీనిని తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ 678ని 2.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ క్రియో 460 ఆక్టా-కోర్ సిపియుపై తయారు చేసారు. స్నాప్‌డ్రాగన్ 675 యొక్క 2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కంటే కొంచెం వేగంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 678లో క్వాల్కమ్ అడ్రినో 612 జీపీయు కూడా ఉంది. దింతో ఇది వేగంగా గ్రాఫిక్స్ రెండరింగ్‌ను డ్రైవ్ చేస్తుంది, తక్కువ ఫ్రేమ్ డ్రాప్‌లతో అధిక ఫ్రేమ్‌రేట్ల వద్ద మంచి విజువల్స్‌ను అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది.

కనెక్టివిటీ కోసం, స్నాప్‌డ్రాగన్ 678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 12 ఎల్‌టిఇ మోడెమ్‌తో వస్తుంది. దీని గరిష్ట డౌన్‌లోడ్‌ స్పీడ్ 600 ఎమ్‌బిపిఎస్,అప్‌లోడ్ స్పీడ్ 150 ఎమ్‌బిపిఎస్ గా ఉంది. ఇది డ్యూయల్-సిమ్ డ్యూయల్ VoLTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0,  ఎన్ఎఫ్ సి, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, జిపిఎస్, QZSS, SBAS నావిగేషన్ సిస్టంలకు కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 678 4కే అల్ట్రా హెచ్డి రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఆడియో పరంగా క్వాల్కమ్ ట్రూవైర్‌లెస్ స్టీరియో ప్లస్ టెక్నాలజీ, క్వాల్కమ్ అక్స్టిక్ ఆడియో టెక్నాలజీ, క్వాల్కమ్ ఆప్టిఎక్స్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది.
 

మరిన్ని వార్తలు