‍కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్‌ మస్క్‌

5 Dec, 2022 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తారేమో అనే  భయాన్ని వ్యక్తం చేశారు. శనివారం ట్విటర్‌ స్పేస్‌లో మాట్లాడిన మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే బహిరంగా తిరగాలని తాను అనుకోవడంలేదని పేర్కొనడం గమనార్హం.  ముఖ్యంగా  హంటర్‌ బిడెన్‌ ట్విటర్‌ ఫైల్స్‌ అంటూ తాజా ల్యాప్‌టాప్  కథనాల ప్రకంపనల తరువాత మస్క్‌ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. 

తనకేదో కీడు జరిగే ప్రమాదంకనిపిస్తోంది..కచ్చితంగా కాల్చి చంపేసే అవకాశం కనిపిస్తోందంటూ ఎలాన్‌ మస్క్‌ భయపడిపోతున్నారు. ఒకర్ని చంపాలి అనుకుంటే అదేమంత పెద్ద కష్టంకాదు అంటూనే అలాంటిదేమీ జరగదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.కానీ కచ్చితంగా ప్రమాదమైతే ఉంది అంటూ   మస్క్‌ తీవ్ర భయాందోళన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.

ఈ సందర్బంగా ట్విటర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛపై మాట్లాడారు. స్వేచ్ఛా ప్రసంగాలను అణచి వేయం. ప్రతీకార చర్యలకు భయపడకుండా మనం చెప్పదలుచుకున్నది చెప్పవచ్చు అని మస్క్‌ ప్రకటించారు. అయితే వాస్తవంగా మరొకరికి హాని కలిగించనంత కాలం, అనుకున్నది  ప్రకటించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.  అంతిమంగా అణచివేత లేని భవిష్యత్తు మనకు  కావాలని  మస్క్  తెలిపారు. 

కాగా అమెరికాలో 2020 నాటి ఎన్నికల ఫలితాలను అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు.  జర్నలిస్ట్ మాట్ తైబీ 'ట్విటర్ ఫైల్స్' పేరుతో అంతర్గత పత్రాలను ప్రకటించారు. నిర్దిష్ట రాజకీయ కంటెంట్‌ను తీసివేయమని జో బిడెన్ బృందం ట్విటర్‌ ఉద్యోగులకు సూచించిన ఫైల్స్‌ను శుక్రవారం  విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  

మరిన్ని వార్తలు