ఈ–టూవీలర్ల కోసం రేస్‌ఎనర్జీ, హాలా జట్టు

19 Apr, 2023 06:25 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీ సంస్థ రేస్‌ఎనర్జీ, రైడ్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి.

విస్తృతమైన రేస్‌ బ్యాటరీ స్వాపింగ్‌ నెట్‌వర్క్‌ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్‌ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్‌ శ్రేయాస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు