హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌లో మహిళపై జాత్యాంహకార వివక్ష కలకలం! కేటీఆర్‌ ఆగ్రహం!

29 Aug, 2022 17:50 IST|Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్‌ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. 
 
నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్‌లో ఉన్న సిబ్బంది తమపై జాత‍్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్‌ చేసింది. 

'ఈరోజు హైదరాబాద్ ఐకియా స్టోర్‌ సిబ్బంది నేను మాత్రమే కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇది జాత్యహంకారం కాకపోతే అది ఏమిటి? అని ప్రశ్నించారు.పైగా పేరుతో పిలిచి అవమానించారని అన్నారు. @IKEA ఇటువంటి సిబ్బంది ప్రవర్తనను సమర్థిస్తారా? అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

నాభార్యకు అవమానం జరిగింది
నితిన్‌ సేథి సైతం ఐకియా స్టోర్‌లో తన భార్య సునీతాకు జరిగిన అవమానంపై ట్వీట్‌  చేశారు. నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసే వ్యక్తి..ఈ వస్తువుల్ని మేం కూడా కొన్నాం అంటూ నవ్వాడు. మమ్మల్ని ఒంటరిగా ఉంచారు. అడిగితే సమాధానం ఇవ్వలేదు. పట్టించుకోలేదు. పైగా ఐకియా స్టోర్‌లో పనిచేసే సూపర్‌ వైజర్లు..అవునా కావాలంటే పోలీసుల్ని పిలవండి. మేం వారితో మాట్లాడతామని అన్నారు. ఇది ఇక్కడితో ముగియలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం అంటూ ట్వీట్‌ చేశారు. 

కేటీఆర్‌ ఆగ్రహం
ఈ ట్వీట్ వైరల్‌ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నితిన్‌ సేథికి క్షమాణలు చెప్పాలని, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని యాజమాన్యానికి సూచిస్తూ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌, నితిన్‌ సేథి ట్వీట్‌పై ఐకియా యాజమాన్యం స్పందించింది. స్టోర్‌ల వద్ద సమానత్వం మానవ హక్కుగా భావిస్తాం. ఇక్కడ జాత్యహంకారం, పక్షపాతాలకు తావులేదని తెలిపింది. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తలు