రాధేశ్యామ్‌ వరల్డ్‌ రికార్డ్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా మెటావర్స్‌లో..

4 Mar, 2022 14:02 IST|Sakshi

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధేశ్యామ్‌ రిలీజ్‌కి ముందే అరుదైన రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా మెటావర్స్‌ వెర్షన్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేసింది. రాధేశ్యామ్‌ సినిమాలో భూత, వర్తమాన, భవిష్యత్తులను చెప్పే వ్యక్తిగా కనిపిస్తున్న ప్రభాస్‌.. తన సినిమాని ఫ్యూచర్‌ టెక్నాలజీగా చెప్పుకుంటున్న మెటావర్స్‌లో రిలీజ్‌ చేశారు. 

మార్క్‌ జుకర్‌బర్గ్‌ మరో అద్భుత సృష్టి మెటావర్స్‌. వాస్తవ ప్రపంచం రూపు రేఖలను మెటావర్స్‌ మార్చేయగలదని టెక్‌ నిపుణులు చెప్పుకుంటున్నారు. వర్చువల్‌ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో ఓ కొత్త ప్రపంచపు అనుభూతిని కలిగించడమే మెటావర్స్‌ ప్రత్యేకత.

రాధేశ్యామ్‌ మెటావర్స్‌ ట్రైలర్‌ని 2022 మార్చి 3న చిత్ర నిర్మాతలు రిలీజ్‌ చేశారు. మెటావర్స్‌లో చూసేందుకు వీలుగా లింక్‌ కూడా ఇచ్చారు. మెటావర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాలంటే కొన్ని ప్రత్యేక యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు వీఆర్‌ హెడ్‌సెట్‌, ఇయర్‌ఫోన్స్‌ కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా ప్రారంభ దశలోనే ఈ టెక్నాలజీలో ట్రైలర్‌ రిలీజ్‌ చేసి కొత్త సంప్రదాయానికి చిత్ర యూనిట్‌ తెర లేపింది. 

మెటావర్స్‌ వినియోగించేందుకు ఇండియన్‌ సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ పాప్‌ సింగర్‌ దలేర్‌ మెహందీ తొలిసారిగా మెటావర్స్‌లో లైవ్‌ కన్సర్ట్‌ ఇచ్చారు. ఇంకా ఆ వేడి చల్లారకముందే డార్లింగ్‌ ప్రభాస్‌​ తన సినిమా ట్రైలర్‌ మెటావర్స్‌లో అందించించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్‌కి భారత సినిమా ఏమాత్రం తీసిపోదని నిరూపించారు.

చదవండి: డేటాకు ‘మెటావర్స్‌’ దన్ను..

మరిన్ని వార్తలు