రైల్వే ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్‌!

4 Sep, 2022 15:37 IST|Sakshi

ఉద్యోగులకు రైల్వే శాఖ భారీ షాక్‌ ఇవ్వనుంది. విపరీంగా పెరిగిపోతున్న ఖర్చులపై ఆందోళన చెందుతున్న రైల్వే బోర్డు..ఉద్యోగులకు చెల్లించే భత్యాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

ఛైర్మన్‌ వీకే త్రిపాఠీ ఆధ్వర్యంలో రైల్వే బోర్డ్‌ ఏడు జోన్‌లలో రివ్వ్యూ నిర్వహించింది. మీటింగ్‌లో ఈ ఏడు జోన్లకు సంబంధించి ఓవర్‌ టైం చేస్తున్న రైల్వే ఉద్యోగులకు చెల్లించే అలవెన్స్‌లు, నైట్‌ డ్యూటీ, ట్రావెల్‌, ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చుల‍్ని వీకే త్రిపాఠి ఆరా తీసినట్లు సమాచారం. 

అయితే ఈ సందర్భంగా గతేడాది కంటే ఈ ఏడాది సాధారణ పని ఖర్చులు ( Ordinary Working Expenses) సగటున 26శాతం పెరిగాయని పీటీఐకి తెలిపారు. ముఖ్యంగా నార్తీస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే (37.9 శాతం), నార్తన్‌ రైల్వే (35.3 శాతం), దక్షిణ మధ్య రైల్వే (34.8 శాతం), సౌత్ వెస్ట్ రైల్వే (33.1 శాతం), నార్త్ వెస్ట్ రైల్వే (29 శాతం), పశ్చిమ రైల్వే (28 శాతం) , ఉత్తర మధ్య రైల్వే (27.3 శాతం) ఉన్నట్లు గుర్తించారు.

ఇలా ఖర్చులు కొనసాగితే 2022-2023లో రైల్వే బడ్జెట్‌ మొత్తం పని ఖర్చులు రూ.2.32లక్షల కోట్లు ఉండొచ్చని రైల్వే బోర్డు  అంచనా వేసింది. ప్రస్తుతం ఆడిట్‌ కంప్లీట్‌ కాలేదు కాబట్టి అంచనా మాత్రమే చెప్పినట్లు పీటీఐ అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం తెలిపింది. 

ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లుగానే వ్యయ నియంత్రణ, నిర్వహణపై రైల్వే బోర్డు మార్గదర్శకాలను జారీ చేసినటు తెలుస్తోంది. అంతేకాదు రైల్వే బోర్డు వారి ఖర్చులను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జోన్‌లకు సూచించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జనరల్ మేనేజర్‌లను కోరినట్లు వర్గాలు తెలిపాయి.

ఓటీ (ఓవర్‌టైమ్‌), ఎన్‌డీఏ (నైట్‌ డ్యూటీ అలవెన్స్‌), కేఎంఏ (కిలోమీటరేజీ అలవెన్స్‌) వంటి నియంత్రిత వ్యయాలను చాలా నిశితంగా పరిశీలించాలని రైల్వే బోర్డు జనరల్ మేనేజర్‌లకు సూచించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

అదనంగా, తూర్పు రైల్వే (ఈఆర్‌ ), దక్షిణ రైల్వే (ఎస్‌ఆర్‌), నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఈఆర్‌), ఉత్తర రైల్వే (ఎన్‌ఆర్‌ ) వంటి జోన్‌లు రైళ్లను నడిపే రన్నింగ్ సిబ్బందికి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అయితే కిలోమీటరు భత్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రైల్వే (ఎస్‌ఈసీఆర్‌), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్‌), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్‌) నైట్ డ్యూటీ అలవెన్సుపై తమ వ్యయాన్ని తగ్గించాలని కోరింది.

మరిన్ని వార్తలు