సీనియర్‌ సిటిజన్లకు రైల్వే శాఖ భారీ షాక్‌!

14 Dec, 2022 21:28 IST|Sakshi

సీనియర్‌ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. గతేడాది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సుమారు రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌కు తెలిపారు. 

సీనియర్‌ సిటిజన్లకు రాయితీలను ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారంటూ మహరాష్ట్ర ఎంపీ నవనీత్ (రాణా) కౌర్‌ అశ్వినీ వైష్ణవ్‌ను ప్రశ్నించారు. నవనీత్‌ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. రైల్వేలో పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు అధికంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్లకు రాయతీని పునరుద్ధరించడం ఇప్పట్లో వీలుకాదని పేర్కొన్నారు.  

అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే..రాయితీని అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే సీనియర్ల రాయితీని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వే పరిస్థితిని కూడా చూడాలని కోరారు.
 

మరిన్ని వార్తలు