వారెట్‌బఫెట్‌ ఆఫ్‌ ఇండియా లక్కు.. టాటా మోటార్స్‌తో భారీ సంపాదన

12 Oct, 2021 13:55 IST|Sakshi

Rakesh Jhunjhunwala Stocks: ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి స్టాక్‌ మార్కెట్‌తో లాభపడ్డారు. నాలుగు సెషన్ల వ్యవధిలో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన నజారా టెక్నాలజీస్‌, టైటాన్‌ కంపెనీ, టాటా మోటర్స్‌ స్టాకులు ఒక్కసారిగా పెరగడంతో.. ఆయన సంపాదనా పెరిగింది. 


చివరి నాలుగు సెషన్స్‌లో ఒక్క టాటా మోటర్స్‌ షేర్సే 30 శాతం పెరగడం విశేషం. మోర్గాన్‌ స్టాన్లే వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం.. 298రూ.గా ఉన్న టాటా షేర్ల ధరలు.. 448రూ. చేరుకున్నాయి.  ఈ బలమైన పెరుగుదలతో ఆయన ఆదాయం వందల కోట్లను దాటేసింది. మూడు సెషన్స్‌లోనే 310 కోట్ల రూపాయల్ని(24 శాతం షేర్ల పెరుగుదల) సంపాదించారాయాన. 

ఇదిలా ఉంటే కరోనా టైంలోనే టాటా మోటర్స్‌ షేర్లపై ఝున్‌ఝున్‌వాలా దృష్టిసారించారు. సుమారు 4 కోట్ల షేర్లను సెప్టెంబర్‌ 2020లో కొనుగోలు చేశారాయన. ఈ ఏడాది జూన్‌ చివరినాటికి ఝున్‌ఝున్‌వాలా టాటా మోటర్స్‌లో 1.14 శాతం వాటాను(1,643 కోట్ల విలువ), 3కోట్ల77లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. మార్కెట్‌ ర్యాలీలో నాలుగు రోజుల్లో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారాయన.

పండుగ సీజన్‌, పైగా ఈవీ కార్ల రంగంలోకి ప్రయత్నాలు మొదలయిన తరుణంలో టాటా షేర్లు విపరీతంగా పెరగడానికి కారణం అయ్యాయని మోర్గాన్‌ స్టాన్లే వెల్లడించింది. 

చదవండి: Akasa Air: ఝున్‌ఝున్‌వాలాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు