దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్‌

23 Jul, 2021 13:06 IST|Sakshi

దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్‌. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్‌.  వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్‌. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు.

రాకేశ్‌ జున్‌జున్‌వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్‌ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టి  36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన‍్షియల్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్‌ ఫండ్‌ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఐపీఓకి స్టార్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌
రాకేశ్‌ జున్‌జున్‌వాలా స్టార్‌ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్‌ యూనైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో  వి.జగన్నాథన్‌ చెన్నైలో స్టార్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ను ప్రారంభించి మెడిక‍్లయిమ్‌,యాక్సిడెంటల్‌ ఇన్స్యూరెన్స్‌తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్‌ బుల్‌ రాకేశ్‌ 2018 ఆగస్ట్‌ నెలలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  

చదవండి: హింట్‌ ఇచ్చేసిందిగా, ఇండియన్‌ రోడ్లపై టెస్లా చక్కర్లు

మరిన్ని వార్తలు