రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా రూ.5వేల పెట్టుబడి..41వేల కోట్లు ఎలా సంపాదించారు

14 Aug, 2022 12:28 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌ . కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా. రాతలు మార్చుకోవాలన్నా. అన్నీ అక్కడే సాధ్యం. కోట్లాది మంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. అలాంటి కేపిటల్‌ మార్కెట్‌కు మెగస్టార్‌ అయ్యారు. మిడిల్‌ క్లాస్‌ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసి హీరో అనిపించుకున్నారు. ఆయన మరెవరో కాదు ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌.. రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా. కేవలం రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లను సంపాదించారు. అలాంటి దలాల్‌ స్ట్రీట్‌ బిగ్‌ బుల్‌ గురించి ప్రత్యేక కథనం. 

స్టాక్‌ మార్కెట్‌లో అతను పట‍్టిందల్లా బంగారమే. నిమిషాల్లో పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదించిన ఘనాపాఠీ. డబ్బును డబ్బుతో సంపాదించిన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా జులై 5, 1960లో హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి రాధేశ్యామ్‌ ఝున్‌ఝున్‌ వాలా ఇన్‌ కం ట్యాక్స్‌ అధికారి. విధుల నిమిత్తం రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా కుటుంబం   ముంబైలో స్థిరపడింది. 

తండ్రి ఒప్పుకోలేదు
లెక్కల్లో ఆరితేరిన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా.. కాలేజీ రోజుల్లో ఆయన తండ్రి రాధేశ్యామ్‌ తన స్నేహితులతో స్టాక్‌ మార్కెట్‌ గురించి ఎక్కువగా చర్చించే వారు. దీంతో రాకేష్‌కు స్టాక్‌ మార్కెట్ పై మక్కువ పెరిగింది.ఆ రంగంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆయన తండ్రి అందుకు ఒప్పుకోలేదు. 

తండ్రి మాట విన్నారు
అయినా పట్టువదలకుండా స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు ఝున్‌ ఝున్‌ వాలా సిద్ధమయ్యారు. అదే సమయంలో తన తండ్రి ఝున్‌ ఝున్‌ వాలాకు ఓ సలహా ఇచ్చారు. ప్రతి రోజూ న్యూస్‌ పేపర్‌ చదవాలని, ఎందుకంటే స్టాక్‌ మార్కెట్‌ హెచ్చు తగ్గులకు ఆ వార్తలే కారణమని సూచించారు. తండ్రి చెప్పిన ఆ మాటే రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లు సంపాదించేలా చేసిందని, ఇదే తనన విజయ రహస్యమని పలు మార్లు మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు.అంతేకాదు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. అందుకు ఓ షరతు విధించారు. తనని వద్ద నుంచి (తండ్రి) కానీ, తన స్నేహితులు దగ్గర డబ్బులు అడగకూడదని షరతు విధించారు. రాకేష్‌ అందుకు ఒప్పుకున్నారు. 

తమ్ముడి స్నేహితురాలే ఆసర
తండ్రి మాట జవదాటని రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా వద్ద కేవలం 5వేలు మాత్రమే ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఎక్కువ మొత్తంలో కావాల్సి వచ్చింది. అందుకే రాకేష్‌ తన తమ‍్ముడి స్నేహితురాలి వద్ద డబ్బులు ఉన్నాయని, ఇంట్రస్ట్‌ ఎక్కువ ఇస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తుందని తెలుసుకున్నాడు. బ్యాంకులు ఏడాదికి 10శాతం ఇంట్రస్ట్‌ ఇస్తే ఝున్‌ ఝున్‌వాలా ఆమెకు 18శాతం వడ్డీ ఇచ్చేలా రూ.5లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని  స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించారు.  

తొలి ఫ్రాఫిట్‌ అదే 
రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా 1986లో రూ.43పెట్టి  5వేల టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్‌ రూ.43 నుంచి రూ.143కి పెరగడంతో మూడు రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ తర్వాత మూడేళ్లలో రూ.20లక్షల నుంచి 25 లక్షలు సంపాదించారు. అలా స్టాక్‌ మార్కెట్‌లో అడుగు పెట్టిన ఝున్‌ఝున్‌ వాలా అప్రతిహాతంగా ఎదిగారు. మెగాస్టార్‌ అయ్యారు. 

37స్టాక్స్‌ ఖరీదు రూ.20వేల కోట్లు 
2021,మార్చి 31 నాటికి రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా టైటాన్‌ కంపెనీ, టాటా మోటార్స్‌, క్రిసిల్‌,లుపిన్‌,ఫోర్టిస్‌ హెల్త్‌ కేర్‌,నజారా టెక్నాలజీస్‌,ఫెడరల్‌ బ్యాంక్‌, డెల్టా కార్పొరేషన్‌, డీబీ రియాలిటీ, టాటా కమ్యూనికేషన్‌లో 37స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. వాటి విలువ అక్షరాల 19695.3కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు