రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2021 నాటి వీడియో వైరల్‌

14 Aug, 2022 14:00 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐకానిక్‌ ఫిగర్‌ ఆఫ్‌ స్టాక్‌ మార్కెట్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంపై ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సహా  దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, బిజినెస్‌ వర్గాలు సంతాపం వ్యకం చేస్తున్నారు. ఈ సందర్భంగా లెజెండ్రీ ఇన్వస్టర్‌తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.  పలు వీడియోలను ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు  RIP Rakesh Jhunjhunwala  ట్రెండింగ్‌లో నిలిచింది. బాలీవుడ్‌ పాపులర్‌ సాంగ్‌  కజరారే పాటకు వీల్‌ చైర్‌లో ఉండి కూడా ఉత్సాంగా డ్యాన్స్‌ చేసిన తీరు వైరల్‌గా మారింది.

చదవండి :  రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?

ముఖ్యంగా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2021లో ‘కజరారే’  పాట బీట్‌కు డ్యాన్స్‌ చేసిన వీడియో  వైరల్‌గా మారింది. వీల్‌చైర్‌లో ఉన్న రాకేష్ తన స్నేహితులు , కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ షేర్‌ చేశారు. రాకేష్ రెండు కిడ్నీలు పాడై పోయాయి, డయాలసిస్‌లో ఉన్నారు.. అయినా కానీ జీవితాన్ని జీవించాలనే బలమైన సంకల్పం ఆయనది అంటూ నిరుపమ్‌ ట్వీట్ చేశారు.  కేశవ్‌ అరోరా తదితరులు ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఈ విషాదకరమైన రోజును గుర్తుంచుకోవాలని లేదు. ఆర్‌జే కన్నుమూసినా, ఆయన ఉత్సాహం, స్ఫూర్తి  తనతోనే ఉంటుందని  పేర్కొన్నారు.

Rakesh Jhunjhunwala: అ‍ల్విదా బిగ్‌బుల్‌ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం

మరిన్ని వార్తలు