ఓటీటీ వరల్డ్ లో ప్రభంజనం ఆర్జీవీ స్పార్క్ ఓటీటీ

14 May, 2021 14:23 IST|Sakshi

మరికొన్ని గంటల్లో స్పార్క్ ఓటీటీ సరికొత్తగా వినోద రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత ఓటీటీ రంగంలో సరికొత్తగానే కాకుండా అన్ని రకాల ప్రేక్షకుల డిమాండ్లను తీర్చేలా స్పార్క్ ఓటీటీ రంగంలోకి దిగబోతోంది. భారత ఓటీటీ మార్కెట్ లో పెను ప్రభంజనం సృష్టించేలా స్పార్క్ ఓటీటీని రూపుదిద్దిన‌ట్లు ఆ సంస్థ అధినేత‌, యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఈ నెల 15వ తేదీన (అంటే... నేటి అర్ధ‌రాత్రి) భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డీ కంపెనీ’ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం కానున్నాయి. 

ఓటీటీ రంగంలో ఇప్పటికే చాలా సంస్థలే ఉన్నా.. స్పార్క్ ఓటీటీ తనదైన శైలి ఒరిజినల్ వెబ్ సిరీస్, ఐదు భాషలకు చెందిన సంచలన చలన చిత్రాలతో తనదైన ముద్రను వేయనుందని సాగర్ మాచనూరు తెలిపారు. దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్మ ప్రాజెక్టులతో పాటు స్పార్క్ ఓటీటీ... తన సొంత కథాకథనాలతో రూపొందించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలకు చెందిన పాపులర్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది.

చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు