నిరంకుశత్వంపై ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌.. ఆర్జీవీ స్పందన ఇలా..

31 Jan, 2022 10:24 IST|Sakshi

వివాస్పద వ్యాఖ్యలు, తర్కించే ప్రశ్నలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్‌గోపాల్‌ వర్మ ఈసారి ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌పై ఫోకస్‌ చేశారు. ట్విట్టర్‌లో క్రమం తప్పకుండా వివిధ అంశాలపై స్పందించే వర్మ ఎలన్‌మస్క్‌ ట్వీట్‌పై తన స్పందన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఎలన్‌ మస్క్‌ సైతం వివాస్పద ట్వీట్లు , కామెంట్లు చేయడంలో దిట్ట. దీంతో ట్విట్టర్‌ వేదికగా ఒకేసారి వేర్వేరు రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వివాస్పద వ్యక్తులు తారస పడ్డట్టయ్యింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎలన్‌మస్క్‌ 2022 జనవరి 28న ఓ ట్వీట్‌ చేశారు. అందులో ‘ ప్రజలను విపరీతంగా భయపడితే.. ఒక దశలో వాళ్లు మాకు స్వేచ్ఛాస్వాతంత్రాలు వద్దని అంటారు. నిరంకుశత్వానికి ఇదే మూలం అంటూ  కామెంట్‌ చేశారు. సమకాలిన అంశాలు, స్వేచ్ఛా జీవితంపై ఎప్పుడూ మాట్లాడే వర్మ వెంటనే ఈ కామెంట్‌పై కన్నేశారు. మస్క్‌ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్టుగా నమస్తే ఎమోజీలు పెట్టారు. 

నిరంకుశత్వం, స్వేచ్ఛలకు సంబంధించి ఎలన్‌మస్క్‌, రామ్‌గోపాల్‌వర్మ పెట్టిన ట్వీట్లను కొంత మంది సమర్థిస్తుంటే.. ఆఖరికి ఎలన్‌ మస్క్‌ని కూడా నువ్వు వదలవా అంటూ మరికొందరు వర్మపై సెటైర్లు వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు