కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఖాతాలోకి మరో బ్రాండ్‌..!

14 Feb, 2022 10:08 IST|Sakshi

కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ హీరో యశ్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించిన  విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా యశ్‌కు భారీ ఆదరణ రావడంతో ప్రముఖ కంపెనీలు తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు సిద్దమయ్యాయి. తాజాగా రాకీ ఖాతాలోకి మరో బ్రాండ్‌ వచ్చి చేరింది. ప్రముఖ దుస్తుల బ్రాండ్‌ రామ్‌రాజ్‌ కాటన్‌కు పాన్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా యశ్‌  వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఫ్లీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, బియర్డో వంటి బ్రాండ్స్‌కు యశ్‌ ప్రచార కర్తగా ఉన్నాడు.   

ప్రచారకర్తగా యశ్‌ నియామకంతో ప్రజల్లో మరింత ఉత్సాహం నింపుతుందని కంపెనీ అభిప్రాయపడింది. కాటన్‌ వస్త్రాలను బ్రాండింగ్‌ చేయడంలో రామ్‌రాజ్‌ కాటన్‌ అత్యంత ఆదరణను పొందింది. ప్రస్తుతం 50 వేలకు పైగా నేత కుటుంబాలు రామ్‌రాజ్‌ కాటన్‌ బ్రాండ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. దక్షిణాదిలో 10వేల కుటుంబాలకుపైగా ఉపాధి కల్పిస్తోంది. 

చదవండి: అదిరిపోయిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!

మరిన్ని వార్తలు