ర్యాపిడో బైక్‌ కెప్టెన్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై మరింత ఆదాయం

26 May, 2023 07:43 IST|Sakshi

హైదరాబాద్‌: బైక్‌ ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టినట్లు ఆటో–టెక్‌ అగ్రిగేటర్‌ సంస్థ ర్యాపిడో తెలిపింది. ఇందులో భాగంగా రేట్‌ కార్డును సవరించినట్లు వివరించింది. 8 కిలో మీటర్ల వరకు కిలో మీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీనితో ఇతర ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మరింత ఎక్కువగా ట్యాక్సీ కెప్టెన్లకు ఒక్కో ఆర్డరుకు కనీసం రూ. 60 ఆదాయం లభించగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి వివరించారు.

మిగతా ప్లాట్‌ఫామ్‌లలో ఇది రూ. 40–45గా ఉన్నట్లు పేర్కొన్నారు. కెప్టెన్లకు ట్రిప్పులపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. అంటే రైడర్లు బుక్‌ చేసే గమ్యస్థానాల గురించి బైక్‌ కెప్టెన్లకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. బుకింగ్‌ క్యాన్సిలేషన్లను తగ్గించడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..

మరిన్ని వార్తలు