ఈ కంప్యూటర్‌ మౌస్‌ ధర కోటిన్నర? అసలు స్టోరీ ఏమిటంటే!

21 Mar, 2023 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ:  దిగ్గజ టెక్‌  కంపెనీ యాపిల్‌  ఫౌండర్‌  స్టీవ్‌ జాబ్స్‌ అంటే ఒక ఇన్సిపిరేషన్‌. ఆపిల్ కంప్యూటర్లతో, టెక్నాలజీకి విప్లవ బాటలు వేసిన స్ఫూర్తిమంతుడు స్టీవ్ జాబ్స్. అలాంటి స్టీవ్‌ జాబ్స్‌కే ప్రేరణగా నిలిచిన కంప్యూటర్ మౌస్ 147,000 పౌండ్లకు (రూ. 1,48,89,174) అమ్ముడైంది. కంప్యూటింగ్ ఐకాన్ డగ్లస్ ఎంగెల్‌బార్ట్ రూపొందించిన అరుదైన మూడు-బటన్ల మౌస్, కోడింగ్ కీసెట్ బోస్టన్-ఆధారిత ఆర్‌ఆర్‌ నిర్వహించిన  వేలంలో దాని అంచనా 12వేల  పౌండ్ల కంటే దాదాపు 12 రెట్ల రికార్డు ధరను దక్కించుకోవడం విశేషం. 

మెట్రో అందించిన రిపోర్ట్‌ ప్రకారం కంప్యూటర్‌ వాడకలో అత్యంత కీలకమైన మౌస్‌ రూ. 1.49 కోట్లను సాధించింది.  ఎంగెల్‌బార్ట్ రూపొందించిన అరుదైన, తొలి త్రి-బటన్ కంప్యూటర్ మౌస్, (సుమారు 4″ x 2.75″ x 2.5″)  దిగువన ఉన్న రెండు మెటల్ డిస్క్‌లను (X-యాక్సిస్, Y-యాక్సిస్‌కు అనుగుణంగా) వినియోగిస్తుంది. కోడింగ్ కీసెట్‌లోని ఐదు కీలను ఉపయోగించి మొత్తం 31 వేర్వేరు కీ ప్రెస్‌లను తయారు చేయవచ్చు. ఈ సెటప్‌ని ఉపయోగించి, వినియోగదారు తమ ఎడమ చేతితో టైప్ చేయవచ్చు.  "మదర్ ఆఫ్ ఆల్ డెమోస్" దీన్ని అభివర్ణిస్తారు. ఇపుడు వాడుతున్న మౌస్‌లకు ఇది మాతృక.

స్టీవ్ జాబ్స్ 1979లో ఒక పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినప్పుడు మౌస్ , గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI)ని చూశారు. దీన్ని ఆపరేట్ చేయడం ఎంత సులభమో గ్రహించి చాలా సంతోష పడ్డారుట. దాంతో ఆపిల్ కంప్యూటర్లకు  కూడా దీనిని అనుసరించాలని భావించారు. కానీ 245-పౌండ్ల జిరాక్స్ మౌస్ పని తీరు సరిగ్గాలేకపోవడంతో 12-పౌండ్లతో వన్‌ బటన్ మౌస్‌ రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ఆర్‌ఆర్‌వేలంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్‌స్టన్ మాట్లాడుతూ ఎంగెల్‌బార్ట్ ఆవిష్కరణ కంప్యూటర్ చరిత్ర పరిణామంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది. ఆధునిక జీవిత గమనాన్ని  మార్చివేసిందన్నారు.  

>
మరిన్ని వార్తలు