వెల్‌కమ్‌ బ్యాక్‌ ఎయిర్‌ ఇండియా - రతన్‌ టాటా

9 Oct, 2021 14:32 IST|Sakshi

ఎయిర్‌ ఇండియాను టాటాసన్స్‌ తిరిగి సొంతం చేసుకోవడంపై రతన్‌ టాటా ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సమయంలో జేఆర్‌డీ టాటా మన మధ్య ఉంటే ఎంతో సంతోషించేవాడని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. 

జంషెడ్‌జీ రతన్‌ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత టాటా ఎయిర్‌ ఇండియాగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం జాతీయం చేసింది. జేఆర్‌డీ టాటా నుంచి రూ. 2.8 కోట్లు వెచ్చించి ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత 68 ఏళ్ల తర్వాత ఎయిర్‌ ఇండియా తిరిగి టాటా సన్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకుగాను టాటా సన్స్‌ రూ. 18,000 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.

సుదీర్ఘకాలం తర్వాత ఎయిరిండియా సొంతం కావడంతో రతన్‌ టాటా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం ముందు జేఆర్‌డీ టాటా నిల్చుని ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎయిరిండియాను పునర్‌ నిర్మించేందుకు అవకాశ లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏవియేషన్‌ రంగంలో టాటా గ్రూపు ప్రాతినిథ్యానికి ఎయిర్‌ ఇండియా ద్వారా అవకాశం కలిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎయిర్‌ ఇండియా వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటాను గుర్తు చేసుకున్నారు రతన్‌ టాటా. జెఆర్‌డీ టాటా హయాంలో ప్రపంచలోనే ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానాలకు గొప్ప గౌరవం ఉండేదన్నారు. టాటా గ్రూపుకి మరోసారి ఆ స్థాయికి ఎయిర్‌ ఇండియాను తీసుకుపోయే సమయం వచ్చిందన్నారు. ఈ సమయంలో మన మధ్యన జేఆర్‌డీ టాటా ఉంటే చాలా సంతోషించేవారంటూ ఎమోషనల్‌ అయ్యారు రతన్‌ టాటా. తమకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి : సొంతగూటికి ఎయిరిండియా!!

మరిన్ని వార్తలు