‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్‌ టాటా భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌!

16 Jan, 2023 11:01 IST|Sakshi

రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్‌లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్‌ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్‌ చేశారు.

1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త‍్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది.

A post shared by Ratan Tata (@ratantata)

చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ

మరిన్ని వార్తలు