ఇళ్లు కట్టుకునేవారికి షాక్‌ ! వాటి ధరల్లో పెరుగుదల

26 Mar, 2022 18:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిమెంట్, స్టీల్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి గృహాల ధరలు పెరుగుతాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) అంచనా వేసింది. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల రేట్లు 10–15 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. 

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిర్మాణ రంగాన్ని.. తాజాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరింత దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. నిర్మాణ వ్యయం పెరగడంతో ఆ మేరకు వచ్చే లాభం తగ్గిపోయిందని, దీంతో ఇళ్ల రేట్లను పెంచడం మినహా డెవలపర్లకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. కాపర్, పీవీసీ, రంగులు, అల్యూమినియం ధరలు రికార్డ్‌ స్థాయిలో పెరిగాయి.
 

మరిన్ని వార్తలు