రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ

7 Dec, 2022 10:29 IST|Sakshi

ఆర్ధిక అనిశ్చితపై వెలుగులోకి వచ్చిన నివేదికలు, ఆర్ధిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రెపోరేట్లను మరో 35 బేసిస్‌ పాయింట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక వృద్ధి, తగ్గుముఖం పట్టనున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 35 బేసి​ పాయింట్ల మేర పెంచింది. దీంతో 6.25శాతానికి పెరిగిన రెపోరేట్‌ పెరిగింది.    

వడ్డీ రేట్లపై దూకుడు వద్దు
సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌కు ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్‌ బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్‌బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్‌ విజ్ఞప్తి చేసింది. 

మరిన్ని వార్తలు