రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ కంపెనీలకు ఆర్‌బీఐ షాక్‌

17 Dec, 2022 09:01 IST|Sakshi

న్యూఢిల్లీ: పేమెంట్‌ గేట్‌వే సేవలు అందిస్తున్న రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాక్‌ ఇచ్చింది. పేమెంట్‌ ప్రాసెసింగ్‌ వ్యాపారంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘పేమెంట్‌ అగ్రిగేటర్, పేమెంట్‌ గేట్‌వే లైసెన్స్‌ కోసం ఆర్‌బీఐ నుంచి జూలైలో సూత్రప్రాయ ఆమోదం లభించింది.

తుది లైసెన్స్‌  కోసం ఆర్‌బీఐకి కంపెనీ అదనపు సమాచారం అందించాల్సి ఉంది. అంత వరకు కొత్త ఆన్‌లైన్‌ వ్యాపారులను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ కోరింది’ అని రేజర్‌పే తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రభావం ప్రస్తుత వ్యాపారాలపై ఉండబోదని కంపెనీ వెల్లడించింది.

చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!

మరిన్ని వార్తలు