RBI Alert: ఈ యాప్ వాడుతున్న వారికి ఆర్‌బీఐ అలర్ట్..!

23 Feb, 2022 20:58 IST|Sakshi

RBI Cautions: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలను హెచ్చరించింది. ఎస్‌రైడ్‌ యాప్‌ వాడేవారిని లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ యాప్‌ను మొబైల్‌లో వినియోగిస్తున్నట్లయితే వెంటనే డిలీట్‌ చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. ఎస్‌రైడ్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ గురుగ్రామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్(వాలెట్) సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదు అని తెలిపింది. 

అందుకే వినియోగదారులు ఎవరైనా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే తొలగించాలని పేర్కొంది. ఈ యాప్‌కు సంబంధించి ఎలాంటి సేవలు వాడొద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఒకవేళ ఇంకా యాప్ వినియోగిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా ఎస్‌రైడ్‌ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తన కార్ పూలింగ్ యాప్ 'ఎస్‌రైడ్‌' ద్వారా సెమీ క్లోజ్డ్(నాన్ క్లోజ్డ్) ప్రీ పెయిడ్ ఇనుస్ట్రుమెంట్(వాలెట్)ను నిర్వహిస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. అందుకే, ఈ యాప్ నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు ఆర్‌బీఐ సూచించింది.

(చదవండి: అంతర్జాతీయంగా అదరగొడుతున్న హైదరాబాద్ ఈవీ స్టార్టప్ కుర్రాళ్ళు..!)

మరిన్ని వార్తలు