భారత్‌-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!

16 Mar, 2023 14:53 IST|Sakshi

ఆర్‌బీఐ, యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌ల మధ్య కీలక ఒప్పందం 

ముంబై:  భారత్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్‌ బ్యాంక్‌ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్‌ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది.  

(ఇదీ చదవండి:  లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు)

ఫైనాన్షియల్‌ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్‌ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని  అంచనా.  ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్‌ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో  యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్‌ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు